Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు సొంతూళ్లో హైటెన్షన్!... పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు... చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిన్న సాయంత్రం నుంచే పోలీసు ఆంక్షలు (పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్) అమల్లోకి వచ్చేశాయి. గ్రామంలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు నేటి ఉదయం నుంచి ఇంటింటిని సోదా చేస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ... నారావారిపల్లె నుంచి విశ్వరూప యాత్రను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో నిన్న రాత్రే మంద కృష్ణ మాదిగను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు గుంటూరు తరలించారు. అయితే తమ నేత ఇచ్చిన పిలుపు మేరకు యాత్రను నిర్వహించి తీరతామని ఎమ్మార్పీఎస్ నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు అప్పటికే గ్రామంలో ప్రవేశించి ఉంటారన్న అనుమానాలతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. దీంతో నారావారిపల్లెలో హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

More Telugu News